పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

54 శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల గీ|| నే సుధీనిధి కరిగాపులై సుఖింతు రంగబంగాళ చోళ కళింగవంగ గౌళపాంచాలనేపాళమాళవాంధ్ర శకయుగంధరముఖ్య దేశములనృపులు. శా 11 ఆవిన్నాణపు వేలుపందొర ప్రపన్నానీకముల్ గొల్వఁగా శ్రీవైకుంఠపురంబు వెల్వడి లసచ్చృంగారుఁడై యిందిరా దేవిం దోడ్కొని స్వామిపుష్కరిణికాతీరప్రదేశంబునకా భావింపం దగు హేమసౌధమున శంభల్లీల వర్తించుచుకా. సీ|| ఆమోదమున రమారామాలలామంబు మెఱుఁగారు. సురముపై మెఱుఁగు లీన నహితలోకైక దుస్సహసహస్రారంబు లాలితంబగుచుఁ గెంగేల నమర ఘనత రామలకనత్కనకోత్తరాసంగ దీధితి యొడలిపై దేజరిల్ల భూరిగ్వెరీకచారుహీరకోటీరంబు కొమరారు నుత్తమాంగమునఁ దనర గీ|| లలితధాతువిచిత్రశిలావిశేష శేషగిరిశృంగళృంగారచితనీశాంత బహుళమణిరాజరాజితభద్రపీతి . సరసగతి వేంకటాచలస్వామి వెలయు,