పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

○○ తాళ్లృపాక అన్నమాచార్యుఁడు ఈతడు 15 - వ శతాబ్దమువాఁడు. తండ్రి నారాయణసూరి, తల్లి లక్కా-ంబ. జన్మస్థానము రాజంపేట తాలూకాలోని తాళ్ళపాక. ఈ కవి సాళువ నరసింహదేవరాయల కాలములో నున్నవాఁడు. ఆంధ్ర ద్రవిడ కర్ణాటభాషలలో సంకీర్తనపద్ధతి కీతడే సృష్టికర్త. సరససంగీతవిలాస ములతో సర్వజనసులభముగా. సంకీర్తనాత్మకముగా నాంధ్ర వేదాంతము నవతరింపజేసినాఁడు. ఈతనికి సంకీర్తనాచార్యుఁడని, హరికీర్తనాచార్యుఁ డని, పదకవితాపితామహుఁడని, ఆంధ్ర వేదాంతకర్త యని బిరుదులుగలవు. ఆధ్యాత్మ్యసంకీర్తనలు, శృంగార సంకీర్తనలు, వేంకటేశ్వర శతకము , శృంగారమంజర్యాదులు లభించినవి. సంకీర్తనలక్షణము (సంస్కృతము) శ్రీవేంకటాచలమాహాత్మ్యము, రామాయణము మొదలైన గ్రంథములు రచించినట్లు ఈతని మనుమడు చెప్పెను. కాని పైగ్రంథములు కాన వచ్చుటలేదు. శ్రీ వేంకటేశ్వర శతకము dåll పల్లవపాణి విశ్వగురుభామిని యిట్టి ప్రపంచ మంతకుకా దల్లి సమస్త జీవులనిదానమ శ్రీయలమేలుమంగ ! నీ చల్లనిచూపు చిల్కీ- వెదచల్లఁగఁ ఋణ్యుల మైతి మండ్రు భూ మెల్లను నీ వధూమణి ననేకవిధంబుల వేంకటేశ్వరా ! చ) వెలయఁగ వేంకటాచలమువీథులఁ గమ్మని పుష్పవృష్టి Ŝo పలరఁగ నేఁగివచ్చి యలపారఁగ నయ్యలమేలుమంగతో నలరఁగ గోరకమ్ముల లతాంగనలిమ్ముల సేస చల్లఁగాఁ గలకలనవ్వు మిమ్ముఁ గలకంఠశుకావళి వేంకటేశ్వరా ! مییابد.