పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

--چ రేవణూరి వెంకటాచార్యులు ఈతఁడు 17 - వ శతాబ్దము తుదినుండబోలు. తండ్రి తిరుమల కొండయార్యుఁడు. తల్లి పేరెఱుఁగరాదు. జన్షస్థానముగాని నివాసస్థానము గాని యెఱుఁగరాదు. రామచంద్రోపాఖ్యానము, శకుంతలాపరిణయము, శ్రీపాదరేణుమాహాత్మ్యము లీతని కృతులు. రామచంద్రోపాఖ్యానము లభ్యమగుటలేదు. ఈ స్తుతిపద్యములు శ్రీపాదరేణుమాహాత్మ్యములోనివి. శ్రీవేంకటేశ్వరుని శ్రీపాదరేణుమాహాత్మ్య మిందలి యితివృత్తము. సీ|| ఇంపైన క్రొవ్వాఁడి సంపెంగ నెత్తావి నింపు జవ్వని మేని సొంపు తావి పాటలీకుసుమంబు సూటిగంధపుఁ జల్వ బోటి మైగంధంపు మేటి చల్వ కల్వ క్రొవ్విరి మంచి విల్వ వాసన గొల్వఁ జెల్వ దేహపు మంచి చల్వ వలపు నెమ్మి బంగరు తమ్మి దొమ్మి గ్రందు దువాళి కొమ్మ యంగము గ్రమ్ముకొను దువాళి గీII సమ్మదానందమును బొందు సన్మునీంద్ర యెమ్మెలాడి తనూ సౌరభమ్ము సాటి కమ్మవిరు లన్నిటికి సౌరభమ్ము లొ సఁగు సుమ్ము హరిపాదరేణులేశమ్ము మదన.