పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

18 శ్రీ వేంకటేశ్వరస్తుతిరత్నమాల

క|| మునుపు పరివారదేవత
    లను దగ సేవించి నిర్మలపేమ భరం
    బున మేను గగురు పొడువఁగ
    ననఘుఁ డతఁడు లోని కరిగి యగ్రమునందున్.
సీ|| మృదుపదాంబుజములు మెఱుగుటం దెలుఁ బైడి
           దుప్పటియును మొల ముప్పిడియును
    మణిమేఖలయు బొడ్డుమానికంబును వైజ
           యంతియు నురమున నలరు సిరియు
    వరదహస్తముఁ గటి వర్తిల్లుకేలుశం
           ఖముఁ జక్రమునుదాల్చు కరయుగంబుఁ
    దారహారంబులుఁ జారుకంథంబు ని
           ద్దపుఁ జెక్కులును నవ్వుదళుకు పసలు
గీ|| మకరకుండలములును దామరలఁ దెగడు
    కన్నులు మానోజ్ఞనాసయుఁ గలిగి బొవులు
    ముత్తియపునామమును రత్నమకుటవరము
    నెసఁగ గనుపట్టు శ్రీవేంక పేళుఁ జూచె.

వ|| ಇట్లు జూచి,

శా|| ప్రత్యంగంబును మిక్కిలిం దడవుగా భావించి భావించి యా
     దైత్యారాతితనూవిలాసము సమస్తంబుకా విలోకించెఁ దా
     నత్యంతంబును వేడ్డఁ బొంగుచు నితాంతాశ్చర్యముంబొందుచున్
     గృత్యంబేమియుఁ గొంత ప్రొద్దెఱుఁగ కక్షీణప్రమోదంబుతోన్.