పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౩

సుంకసాల నరసింహకవి

ఈతడు 16-వ శతాబ్దము వాఁడు తలిదండ్రుల పేరు, నివాసస్థానము యెఱుఁ గరాదు. భట్టరుచిక్కా-చార్యుల శిష్యుఁడ నని చెప్పకొన్నాఁడు. తన గ్రంథమును శ్రీరంగనాథున కంకితమిచ్చినాడు. మాంధాతృచరిత్ర మిందలి యితివృత్తము. కవిత్వము సంస్తృతపదభూయిష్టముగా నున్నది.

కవికర్ణరసాయనము

వ|| ఇట్లు గరుడవాహనరూఢుండై యారూఢ దివ్యముని నేవ్య మా నుండై యఖిలభువనా వనదశుండై పుండరీకాకుండు ప్రత్యక్షం బగుటయు.

శా|| హర్దాశ్చర్యభయంబు లుప్పతిల సా షాంగంబుగా మ్రొక్కియు
త్తర్షింపంగఁ దరంబు గాని యొకయంత స్సౌఖ్యముకా బొంది పై
వర్షింపం బ్రచుదాశ్రు పూరము కరద్వంద్వంబు నొక్కొంతగా
శీర్షంబుం గదియించి సాంద్రపులక శ్రేణీపరీతాంగుఁడై.

దండకముII శ్రీవల్లభా ! గల్లభాగద్వయీ దర్పణాత్యర్పణా లోక ! లోకత్రయత్రాణలీలాకళాదక్ష ! దక్షాత్మజా భర్తృచూళీ పరి ష్కారమందారమాలా భవత్పాద నిర్యత్పయోధార ! దారాసహస్రాం శుదీప్తప్రభాభార దూరీకృతారాతిదైతేయనాధా వరోధాంజన ధ్వాంత సంతాన ! సంతానభూజప్రభాపాదపార్థిప్రజాభీష్టవస్తుప్రదానప్రశస్తా ! సమస్తాత్మభావానుభావంబు నీ వంబుజాతాక్ష ! కె కొన్న పైకొన్న