పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8 శ్రీ వేంకటేశ్వరస్తుతిరత్నమాల



చ|| భవ దురునాభిరంధ్రభవపద్మరజఃపరిమాణపాకసం
భవుఁడు విధాత తద్విమలభావకళాకణమాత్ర వైభవో
ద్భవము జగంబు తద్వివిధ భంగిక సర్గములోన నొక్క_రుం
డివి యని నిశ్చయింప గలఁడే ! భవదీయ గుణంబు లచ్యుతా :

ఉ!| ఎందును నిన్నుఁ గస్న జనులెందును గల్గరు వెండి యెద్దెసం
జెందవు నిన్ను నెద్దెసల జెందని క్రించు లభ_క్తి నొక్కటన్
బొందు గొనంగఁ జాలు కృతపుణ్యులు గల్గినఁ జాలు వారికిన్
బొందగునీలసత్కరుణ పుణ్యయశోమహానీయ మాధవా !

శాIIవిన్నంజాలు భవన్మహత్వము భగద్విజ్ఞానసర్గోష్టి కో
నున్నంజాలు భవత్పదాంబురుహ సేవోత్సాహసంపన్నులం
గన్నంజాలు భవత్పమంచిత జగత్కల్యాణనామంబుఁ బే
ర్కొన్నంజాలు నరుండు శాశ్వతశుభారూడుండు లక్ష్మీశ్వరా !

ఉ|| అక్షరయోగయుక్తులు సమంచితసత్యదయానురక్త లా
లక్షితసర్వధర్ములు విలంఘితకర్ములు బుద్ధికల్పితా
పాక్షరవాక్యరూపులు నిరాకృతకోపులు సంయమక్షమా
శిక్షితు లక్షయుల్ నిను భజించు మహాత్ములు నీరజోదరా !


చII తమతమ పూర్వవాసనలఁ దత్పరులై వివిధాగమోక్త కృ
త్యములు వహించె భవ్యపరతత్వము నయ్యయి సంజ్ఞలం బ్రయ
త్నమునఁ దలంచు సంయతమనస్కుల కెల్లను జేరుచోటు శ్రీ
రమణ భవత్పదంబు సుచిరస్థితి నేళుల కల్టిచాట్పునన్.