పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74


వముతో చూచుచుందురు. మరియు కొత్వాలు చేతి క్రింద సుమారు 3000 పోలీసు భటులును, వివిధోద్యోగులును, పని చేయుచుందురు.


పూర్వము కొత్వాలులు మహాప్రచండులై యుండి రనియు, వారు ఉచ్చరించినవే ఆజ్ఞలుగను, వారు వ్రాసినవే శాసనములుగను నుండుచుండినట్లు జనులు చెప్పుకొందురు.

మేకట రామా రెడ్డిగారు వసపర్తి లో నుండుకాలములో లాల్ ఖాన్ అను నతడు కొత్వాలు పని చేయు చుండెను. ఒక యింగ్లీషు వానిపై యేదో అభియోగము తెచ్చి కష్ట పెట్టుట అతని పతనమునకు కారణమ య్యెనని యందురు. ఇట్లుండ ప్రస్తుత నిజాము గారగు సవ్వాబ్ సర్ మీర్ ఉస్మానలీఖాన్ బహద్దరుగారు గుల్బర్గా ఉరుసును సేవించుకొనుటకై వెళ్లిరి. అచ్చట నవ్వాబ్ ఇమాద్జంగు బహద్దరు అను వారు మొదట జిల్లా పోలీసు నాజము " పని వేసి కొంత కాలము హైకోర్టులో కార్యదర్శిగా పనిచేసి, తర్వాత గుల్బర్గాలో రెండవమారు సెషన్ జడ్జిగ నియుక్తులై యుండిరి. నిజాం ప్రభువుగారు గుల్బర్గా ఉరుసునకు 'వేంచేసియుండినప్పుడు నవాబ్ ఇమాద్జంగుగారిని చూచి వారి శక్తి సామర్థ్యములను విచారించి మెచ్చుకొని తర్వాత వారిని నగర కొత్వాలుగ ఏర్పాటుచేసిరి.