పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

73


వారిని తెనుగువారినిగా జేసినారు. తెలంగానా జనులుహెంకినును వెంకన్న లేక యంకన్న అని పిలుతురు. నగరము లోని జిల్లా పోలీసు నాజిము కచ్చేరీని ఇప్పటికిని తెనుగుజనులు “యంకన్న కచ్చేరి" అని వాడుకొను చుందురు.వేంకట రామారెడ్డిగారు అతాఫుబల్దాను వదలి వనపర్తి రాజాగారు ప్రత్యేకముగా కోరినందున ప్రభుత్వమువారి అనుమతితో వనపర్తి రాజు గారి కార్యదర్శిగా పనిచేయు చుండిరని యిదివరకే వ్రాయబడినది. అట్లు వారు వనపర్తి లో నుద్యోగము చేయుచుండగా హైదరాబాదు నగరములోని కొత్వాలీ యుద్యోగములో కొన్ని మార్పులు జరిగెను.


నగరపు కొత్వాలుపని యనిన సామాన్యమైనది కాదు. ఉద్యోగము చిన్నదైనను ప్రాచీనమునుండి దాని ప్రాముఖ్య తనుబట్టి ప్రధానమంత్రి యుద్యోగము తర్వాత కొత్వాలీ యుద్యోగమే ప్రాధాన్యత వహించి యుండినట్టిది. కారణ మేమనగా హైద్రాబాదు నగరములో ప్రభువుగారును, గొప్ప నవాబులు, ప్రధానియు, ఇతర ముఖ్యాధి గారు లందరును నివ సింతురు. వారందరి యోగ క్షేమములు విచారించు కొనువాడు కొత్వాలు. పైగా కొత్వాలునకు ప్రతిదినము ప్రభువుగారి ప్రాపకముఁడుటచే ఉన్నతోద్యోగులు మొదలుకొని, గొప్ప కోటీశ్వ రులును, ధనికులును, బీదలను, అందరును కొత్వాలును గౌర