పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము


సహాయ కొత్వాలు

కాలము మారిపోయెను. నవాబ్ మీర్ మహబూబలీ పాషాగారు చనిపోయియుండిరి. జిల్లా పోలీసు సర్వాధి కారగు హెంకిన్ గారు ఉపకార వేతనముపై ఉద్యోగము నుండి విశ్రాంతి పొందియుండిరి. నిజామురాష్ట్ర ముసకు వచ్చిన ఆంగ్ల ఉద్యోగులలోను, దేశీయోద్యోగుల లోను ఇంతటి సమర్దుడు ఇదివరకు లభింప లేదని చెప్పవచ్చును. హేంకీన్ గారి కాలములో దేశమం దెందుచూచినను అల్లకల్లోలములు, దౌర్జన్యములు, దోపిళ్ళు జరుగుచుండెను. జిల్లా పోలీసు అధికారులలోను చాలమంది దౌర్జన్య యుక్తులుగా నుండిరి. పైగా వారికి పోలీసు విచారణా పద్ధతులు తెలియ నుండెను. అట్టి సందర్భములలో శాంతిని స్థాపించి, పోలీసు వారికి క్రమశిక్ష నిచ్చి, రాష్ట్రమునకు మహోపకార మొనర్చినారు. తెలంగాణములో బీద రైతులు ఇప్పటికిని హేంకిన్ గారిని తలచుకొను చుందురు. వారి నామమునుకూడ మార్చి