పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70


కప్పుడే యముడు ప్రత్యక్ష మైనట్లు తోచెను. పూర్తిగా ప్రాణములపై ఆశవదలుకొనినారు. రెడ్డిగారు మాత్రము అణుమాత్రముకూడ జంక లేదు. అరబ్బులతో నిట్లు కోపోద్రిక్తులై గర్జించినారు. " మేము బేరీవారి నౌకరులము కాము మేము నిజాం ప్రభువుగారి ఆజ్ఞాబద్దులము. ప్రభు సేవలో చనిపోవుటకు మాకేమియు చింతలేదు. మా కేయపకారమైనను మీయందరి తలలను త్వరలో యెగిరిపోవుననియు, మీరు తప్పించు కొనజాలరనియు గుర్తించుడు. మీరు తెలివి తెచ్చుకొని నిందితులను మాకు పట్టియిండు లేదా. మీరందరును నిందితులే అగుదురు". ఈ ప్రకారముగా ఒక చిన్న ఉపన్యాసమే ఝాడించినారు. అరబ్బులు తత్తరపాటుతో తమ యపచారమునకై ప్రాధేయపడిరి. వారి నాయకులు పాదాక్రాంతులై నిందితులను పట్టియిచ్చిరి. మనోహర్లాల్ పూరీగారికి యెగిరి పోవుచుండిన ప్రాణములు స్వస్థానము చేరుకున్నవి. వేంకట రామారెడ్డి గారికి వేలకొలది ధన్యవాదము లర్పించుకొన్నారు. ఆ కృతజ్ఞతను మరువనివారై తాము రచించిన “ఇన్సిదాదె సురాగ్ రసా నీజు రాయం" అను గ్రంథముయొక్క వ్యాఖ్యానములో ఆనాటి ఘట్టమును గురించి యిట్లు వ్రాసియున్నారు:

" క్రీ. శ1912 లో అత్రాపుబల్గా మొహ తేమిం గారుసు
   (అనగా వేంకట రామారెడ్డిగారు); నేనున్ను . అనగా