పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

69



పనిచేయు నౌకరులను నగరము లోని ప్రభువు గారి దేవిడీకి పంపు చుందురు. ఇట్లు సేవకులు మారుకాలములో ఒక నాటి సాయంకాలమందు చెన్న రాయనిగుట్ట సమీపమందు మహేశ్వరము పటాలములో చేరినట్టి ఆరబ్బులు కొందరు సేవకు రాండ్రతో సరసాలాడుచు వారిని బెదరించిరి. ఈ అరబ్బులు చెన్న రాయని గుట్టచుట్టుపట్టు ప్రాంతాలలో ఇప్పపూత దొంగలించి సారాయిభట్టీలు పెట్టి దొంగతనము చేయుచుండిరి. వీరి దౌర్జన్యము లధిక మయ్యెను. తుదకు ప్రభువుగారి నౌకరుల పైననే తమ దర్చము చూపునంతటి ధైర్యము వీరికి కలిగెను. ఈ సంగతి ప్రభువుగారికి తెలియగా రెడ్డి గారికిని జిల్లాల పోలీసు కచ్చేరీలోని డిప్యుటీ ఇన స్పెక్టరు జనరల్ గా నుండి నట్టి మనోహర్ లాల్ పూరీ గారికిని ఆ దుర్మార్గులను పట్టుకో నుటకై ఆజ్ఞ యిచ్చిరి. వేంకట రామా రెడ్డి గారును, మనోహర్ లాల్ పూరీగారును చెన్న రాయని గుట్టవద్దకిపోయి అరబ్బులను పిలిచి విచారణసాగించి నిందితులను పట్టుకొన జూచిరి. అంతట సుమారు 300 అరబ్బులు కత్తులు, తుపాకులు బాకులు, ధరించి వీరిరువురిని ముట్టడించి భయంకర కోలాహలముచేసిరి. అరబ్బులు చెల రేగిన అసాధ్యలై పోదురు మరియు అట్టి స్థితిలో వారు వెనుక ముందుచూడక హత్య కూడ చేయుటకు వెనుదీయరు. మనోహర్లాలు పూరీ గారి