పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

63


గుల్బర్గానుండి రెడ్డి గారిని 1324 ఫసలీలో నిజామాబాదుకు మార్చి పంపిరి. (ఇదివరకు ఇందూరు అని వ్యవహ రింపబడుచుండిన జిల్లాయే రెడ్డిగారు రెడవమాఱు వెళ్లువరకు నిజామాబాదు అనునూతన నామకరణము బొందియుండెను.) హెంకిన్ గారి నిరుపమానమగు శ్రద్ధ చేత జిల్లాలలోని ఆల్లకల్లోల ములు తగ్గి యుండెను. మరియు వేంకటరామారెడ్డిగారి చాక చక్యము వలన నిజామాబాదులో పరిస్థితులు శాంత ముగాముగానుండెను. నిజామాబాదులో మూడున్నర సంవత్సరములుండిన తర్వాత వీరిని ఔరంగాబాదు జిల్లాకు 1317 ఫసలీలో 300 రూపాయల వరకు జీతము హెచ్చించి పంపిరి.

ఔరంగా బాదునకు వెళ్లిన కొన్ని దినములలోనే అచ్చట కొన్ని పరిస్థితు లేర్పడెను, గుల్బర్గాలో బ్రిటిషిండియా నుండి కొత్త గా ప్లేగు ప్రవేశించి నట్లుగానే, ఔరంగాబాదు లోనికి బ్రిటిషిండియా నుండి రాజకీయ వాతావరణము ప్రవేశించెను. ఔరంగా బాదు బొంబాయి రాజధాని యొక్క సరిహద్దుజిల్లా, బొంబాయిలో లోకమాన్య బాలగంగాధర తిలకు గారిని బ్రిటిషు ప్రభుత్వమువారు రాజద్రోహపు నేరములో శిక్షించి జెయిలులో వేసియుండిరి. మహారాష్ట్రు లుద్రిక్తులై యుండిరి! అదేసమయములో ఇంకొక దిక్కు బెగాలు రాష్ట్రములో రాష్ట్ర విభజనపై బెంగాలీలు విజృంభించి " వందేమాతరం "