పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

55


లస్నియు చెడిపోవును. వీరు చేతిక్రింది
పోలీసుల అజ్ఞానమును, చెడు నడతలను
తొలగించినారు. ఇట్టి గణములతో నొప్పిన
అధికారి ఈ జిల్లానుండి వెళ్ళి పోవుచున్నాడనిన
ఈ జిల్లా యొక్క దురదృష్టమే యన వలెను.

"


అంతకు రెండు సంవత్సరములకు పూర్వమే 1306 ఫ, లో, ఇందూరు జిల్లా పోలీసు నాజింగారు రెడ్డి గారిని గురించి యిట్లు వ్రాసిరి"

"కోర్టు ఇనస్పెక్టరుగారికి ( రెడ్డి గారికి) తనపనిలో
అత్యం తాసక్తి కలదు. శ్రద్ధతో , దినమంతయు
ఉపవాసముండి న్యాయస్థానమందే పనులు
నెరవేర్చుచుండును. ఇతని శ్రమను చూచిన
మాకు జాలి కలుగుచున్నది. ఇతని
యెడ మాకు చాల గౌరవము హెచ్చినది.
అదే సంవత్సరమం కొక సందర్భములో
రెడ్డి గారిని గుంచి పై అధికారి యిట్లు వ్రాసెను;

“ వేంకట రామా రెడ్డి తప్ప ఇక ఈ జిల్లాలో
నమ్మక మైన (పోలీసు) వారు కనిపించరని
జాయింట్ మేజిస్ట్రీటుగారు హేంకీన్ గారితో
చెప్పగా వారాశ్చర్యపడిరి !

రెడ్డిగారు ఇందూరులోను ఎల్గందల్ లోను అందరిని మెప్పించి కీర్తిని ప్రతిష్ఠించి కొనియుండు కాలములో వారిని -