పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50



కొనిమామూలి జవానులతో కలిసి ఏపొరపాటును లేనట్లుగా తమసాధనను ప్రకటించినారు. అధికారికి మరింత ఆశ్చర్యము కలిగి జిల్లా పోలీసు అధి కారినిట్లు విచారించినారు:


“ నేను ఇదివరలో చూచిన తావులందెల్లడము అన్నియు లోప భూయిష్టములే. నేను విచారణ చేసిన స్థలము లుదంతటను ఏయే సంస్కారములు సూచించితినో అవన్నియు యిచ్చట సవ్యముగా నున్నవి. మరియు పోలీసు అధికారులకు డ్రిల్లు రాకుఁడుట గమనించి నాను. కాని యిచ్చట ఈ 'వేంకట రామా రెడ్డి డ్రిల్లు చాల బాగుగా చేసినాడు. ఇదంతయు చిత్రముగా నున్నది. తప్పు వెదకుద మన్న దొరకకున్నది”

జిల్లా పోలీసు అధికారి (మహీ తేమిం) మొగలాయి మనిషి. అతని పేరు మీర్ ఆవఖ్ ఆలీసాహెబ్ అతని 8ని హెంకీన్ గారికీని ఇట్లు సంభాషణ జరిగినది.

మె:హ. “సర్కార్ మింతుసని మాటయిచ్చిన అంతయు మనవి చేసుకొందును.

హెం. “సరే. చెప్పుము. విందునుకాని :

మొహ. "తాము దౌరాకు బయలు దేరిన సంగతివిని ఈ కోర్టు ఇనస్పెక్టర్ పర్యటనములో ఏ యే విషయములను సంస్కరించు చుంటిరో అవన్నియు