పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

49


2000 రూపాయీల సొమ్ములు దొరికెను. వారందరిని న్యాయస్థానములో శిక్షింప జేసిరి. ఇది అపూర్వ విషయము. హెంకిన్ గారు చాలసంతోషించి ప్రభుత్వము నుండి రెడ్డిగారికి 50 కూపాయల విలువచేయు గడియారమును బహుమతిగా నిప్పించి,

హెంకిన్ గారు జిల్లాలలో పోలీసు నాకాల విచారణకై బయలు దేరిన వార్త రెడ్డిగారికి తెలిసెను. హెంకిన్ గారిని తృప్తి పరచుట చాలకష్టమని రెడ్డిగారికి తెలియని విషయము కాదు.హేంకిను గారు మార్గములోని నాకాలను ఇతర పోలీసుకచ్చేరీ లను విచారించు కొనుచు మూడు మాసాలలో కరీంనగరు విచ్చేసిరి. పోలీసు కచ్చేరీ పరిక్ష తీసుకొన్ని. మొదలు పోలీసు ఏమియు లోపములేనట్లుగా నున్నది. తుపాకులు పరీక్షిం చిరి. వారి ఉడుపులను చూచిరి. అన్నియు చక్కగా పరిశుభ్రముగా చిలుమన్న మాట లేక చకచక మెరయుచుండెను. జవానులు దరిని వరుసగా నిలిపి, వారదినసాధనను (Drill) పరీక్షించిరి. ఏమియు లోపము లేదు. హెంకీన్ గారు దిగ్బ్రమచెంది. అంద రిని అందుముఖ్యముగా రెడ్డిగారిని ఎగదిగ చూచిరి. సరే ఇంకను విషయము కనుగొందమని రెడ్డిగారినే డ్రిల్లు చేయుమని ఆజ్ఞాపించిరి. వెంటనే రెడ్డిగారు తుపాకిని మెడపై వైచు