పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42



చనిపోయిరి. హిందువులలో పెక్కురు నాటికిని నేటికిని కలరా యనునది మారికా లేక మహామారియను నొక క్షుద్రదేవరకు యొక్క కృత్యమని, జాడ్యమునకు చికిత్సలు చేయుటకు మారుగా. “మా రెమ్మ"ను శాంతిపరచుటకై "దేవర” చేయుదురు. “మా రెమ్మ'ను తృప్తి పరచుటకై కొన్ని దున్నపోతులను, . గొర్రెలను బలియిత్తురు. హిందువులు యాద్గీరులో కొన్ని కట్టబొమ్మలు చేసి మారెమ్మ పూజలుచేసిరి. అది అచ్చటి తురకలకు గిట్టక వారిలో కొందరు ఆ బొమ్మలను పగుల గొట్టిరి. హిందువు లుద్రిక్తులైరి. కలహము ప్రారంభ మయ్యేనూ. అది 1298 ఫసలీ నాటిమాట. రెడ్డి గారు వెంటనే తమ చాతుర్యము నంతయు నుపయోగించి యుభయ మతముల వారిలో నుండు వైషమ్యములను బోవునట్లుగా వారిలో ఐకమత్యము కలిగించి సమాధాన పరచిరి. ఆనాటి యాపద్ధతి రెడ్డిగారిలో నీ 50 సంవత్సరముల యుద్యోగకాల మందంతటకు వర్తించుచు వచ్చినందువల్లనే వారెందెందు ఉద్యోగము చేసిరో ఆ ప్రాంతములం దంతటను హిందూ ముసల్మానుల కొట్లాటలు జరుగక శాంతిపద్దతు లేర్పడుచు వచ్చినవి. యాద్గీరు హిందూ ముసల్మానుల మతకలహములను గూర్చి అప్పటి జిల్లా తాలూగ్దారు 1298 ఫసలీలో ఈ ప్రకారముగా నిజాం రాష్ట్ర జిల్లా పోలీసు ప్రధాన శాఖకు వ్రాసిరి:----