పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41


డైన కార్కూను ఇంటిని దోచినారు. పోలీసు కచ్చేరి సమీప ముననే యున్నది. వారి కండ్ల యెదుట యీదివిటీ దోపిడి జరుగుచున్నది. వేంకట రామా రెడ్డిగారు 5 -6 మంది జవానులను తీసికొని తుపాకుల బారు చేసి ఒక సందులో కూర్చున్నారు. అరబ్బులు కాల్చుచుండిన సీసముగుండ్లు తమవద్ద కూడ చిట్లి పడుచున్నవి. దోపిడి అయిన తర్వాత అదేమార్గమున వత్తురుకదా అప్పుడు వారిపై తుపాకులు కాల్చి పట్టు కుందమని సంకల్పించిరి. కాని వారు దోచుకొని నెమ్మదిగా ఇంకొక మార్గములో వెళ్ళినారు. తుదకు యెన్నియో దినములు శ్రమించి వారినొకరిగా నొకరిని పట్టుకొవి నానా అవస్థలు పడి వారినుండి అపహృత ద్రవ్యమును చాలమట్టుకు లాగికొని వారికి శిక్షల నిప్పించిరి.

యాధ్గీరులో నుండు కాలములో వరదారావు వద్ద వేంకట రామా రెడ్డి గారు న్యాయశాస్త్ర మభ్యసించి పరీక్షలో కూర్చున్నారు. కాని ఉత్తీర్ణులు కాలేదు. అంతటితో నిరుత్సాహ పడలేదు. మరల మరుసంవత్సరము వకీలు పరీక్షలో కూర్చున్నారు. కాని మరల అపజయమే కలిగినది.

వీరు యాధ్గీరులో అమీనుగా నుండు కాలములో అచ్చటి హిందూ ముసల్మానులలో మత కలహములు చెల రేగెను. యాద్గీరులో కలరా (గత్తర) జాడ్యము వ్యాపించి చాలమంది