పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

35


న నాడు. మొగలాయి. కాలపు పద్ధతులపై అపరాధ పరిశోధనలు చేయ నేర్చినట్టివాడు. ముదిగల్లు తహసీల్ దారు పదవిపై కన్నయ్యాలాల్ అను వారుండిరి. అతడు రాజా కంద స్వామికి బావమరది. అతనికి ఉర్దూ సరిగా రాదు. తనతీర్చులు కూడా తెగుగులో వ్రాసేవాడు. ఆ కాలములో తహసీల్దారులనిన నిరంకుశ మండలాధి కారులకన్న మిన్నయైన వారు. భూమ్యాదాయశాఖకు సంబంధించిన అధికారమలే కాక, మున్సిఫీ అధి కారము లన్నియు వారియందే కేద్రీకరించి యుండెను. తహసీల్దారు కన్నయ్యలాలు వద్ద ఒక కార్కూక్ (గుమాస్తా) వెంకోబారావు అను నతడుండెను. చాలామంది అధి కారులు పుష్కలముగా లంచములు: తినెడి వారు. కార్కూను అయిన వెంకోబరావు ఆ విద్యలో పేరు పొందినవాడు.

రెడ్డిగారి అమీను ఉద్యోగ కాలములో ఈముది గల్లులో చెప్పదగిన విశేషము లేమియు లేవు. ఒక్కయంశము మాత్రము పేర్కొన దగినదై యున్నది. ఆ కాలములో దొంగతనాలు సర్వప్రాంతములో విశేషముగా జరుగుచుండెడివి. ముదిగల్లులో గుజుగ భీమడు అను - గజదొంగ యుండెను. వాని కొడుకు కూడ గజదొంగ. వారు ఒక గాండ్లవాని యింటిలో కొందరి స్నేహితులతో కలిసి దొంగతనము చేసినాడు. గాండ్ల వాడును