పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34


మాకు చాలా ఇనాము లిచ్చినాము. ఇనాము సనదులు ప్రాత కాగితాలమీదను, రాగి రేకుమీదను వ్రాసి యిచ్చినాడు , రాయచూరు జిల్లాను మొదట నిజాముల వద్దనుఁడి ఇంగ్లీషు వారు తీసుకొన్నప్పుడు మా ఇనాము లన్నియు లాగుకున్నారు. ఇప్పుడు మాకు సనదులే మిగిలినయాస్తి” వారి వద్ది సనదులనుకూడ తెప్పించి రెడ్డిగారు చూచినారు. ఒక కాగితము అప్పటికే పురుగులు తిని అంతయు రంధ్రములు పడి యుండెను. రాగి రేకు సనదుకూడ యుండెను. అందేమి వ్రాసి నారో జ్ఞాపకము లేదని రెడ్డి గారు చెప్పి నారు. ఈ విషయమును బట్టిచూచిన ఇంతమాత్రము నిజమని విశ్వసింప వచ్చును. దేవ రాయలు హిందూ మతాచారముల ప్రకారము పరకుల స్త్రీని పెండ్లాడజాలడు. కాని, ఫిరోజుషా మాత్రము ఆ కన్యను వివాహము చేసుకొన్నాడు. దీని పై ఫిరిస్త కథ కల్లలు కొల్లలుగా పెంచి వ్రాసినాడు, ఫిరిస్తాకిట్టి వ్రాతలల నాటేయని యెన్నియో యితరాంశములు స్థిరపరచుచున్నవి. అది విషయాంతరము,వేంకట రామా రెడ్డి గారు రెండేండ్ల కాలము ముదిగల్లులో అమాను పదవిని నిర్వహించుచు వచ్చినారు. అనగా కార్యభార మంతయు చేతి క్రింద మొహరీలు దే! మొహరిర్ పేరు రాబానాయక్ .అతడు భారీమనిషి. బాగా కల్లు, సారాత్రాగ నేర్చి