పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33

 అను సుల్తాను రాజ్యము చేయుచుండెను.అతనికిని ఆకన్నెపై మోహమంకురించెను. దేవరాయలకును ఫీరోజుషాకును యుద్ధము జరిగెనట. అందు దేవరాయలే ఓడిపోయి తన కూతునే ఫీరోజిషాకిచ్చి పెండ్లి చేసి సంధి చేసుకొనెనట! ఇది పిరిస్తాకథ, అంతయు కల్పిత మేయని కొ॥ లక్ష్మణరావు మున్నగు చరిత్ర కారులు స్థిరపరచినారు. ఇంతటి ముఖ్యాంశమును గురించి సమకాలికులగు అబ్దుర్రజాఖ్ అను సుప్రసిద్ధ ముస్లిం చరిత్రకారుడు గాని, నూనిజ్ అను పాశ్చాత్య చరిత్రకారుడుగాని, ఇతర దేశీయ సమళాలిక చరిత్ర కారులు కాని, ఒక్కమాట యైనను వ్రాయలేదు. కాని 200 ఏండ్ల తర్వాత పుట్టిన ఫిరిస్తా కిది యెట్లు తెలిసెనో యేమో!

వేంకట రామా రెడ్డి గారికీ చరిత్రాంశము చూచాయగా తెలిసి ముదిగల్లులో అట్టి కంసాలి వంశమున్నదా యని విచారించి, పరిశోధన చేసినారు. ఆ కంసాలి వంశము నిజముగా నుండనే యుండెను. వారి వంశములో ఉభయ రాజుల మోహింప జేసిన, మోహనాంగి వంటి వారిప్పటికిని కలరట! ఆ వంశము వారిని పూర్వ చారిత్రక కథలోని యాధార్యమును విచారించగా నిట్లు చెప్పినారట. “మా వంశములో పూర్వము అపురూప సుందరాంగి యుండినది నిజమే. ఆమెను, ఫీరోజుషా మోహించి నికా చేసుకొన్నాడు. అందుకు ప్రత్యుపకృతిగా