పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ ప్రకరణము

ప్రారంభోద్యోగము

ముదిగల్లు చారిత్రిక స్థలము. అందొక కోటయు కలదు.ఆకోటకై విజయనగర రాజులకును. బహమనీ నుల్తానులకును పలుమారు యుద్ధములు జరిగియుండెను. అట్టి యుద్దములలో నొక విచిత్ర యుద్ధము కూడ జరిగియుండె సని ఫిరిస్తాయను చరిత్రకారుడు వ్రాసి యున్నాడు. అదేమన ముదిగల్లులో ఒక కంసాలి వారి యువతి చక్కని చుక్కయై దక్కనీ రాజులకే మోహము కలిగించెసట. అకాలమందు విజయనగర చక్రవర్తి యైన మొదటి దేవరాయలు ఆ కంసాలి సుందరిని తనకిచ్చి పెండ్లి చేయుమని కోరెనట! కంసాలి అది మంచిమనుము కాదని నిరాకరింవెనట!! దేవరాయలు ఆగ్రహోదగ్రుడై ముదిగల్లును పెద్ద సేనతో ముట్టడించెనట. కాని గ్రామజనులతో పాటు ఆ సుందరాంగియు బహమనీ సుల్తాను రాజ్యములోనికి పారిపోయెనట. బహమనీ రాజ్యమును 1400 క్రీ. శ. ప్రాంతములో "ఫీరోజుషా”