పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222


కార్య దీక్షాదక్షా-


నానాటికి మీ యవ్యాజ దయవలెనే, వెలుగుచుస్న పాఠశాలా విద్యార్థినీ సంఖ్యచే స్థల సంకోచ మనుభవించుట తప్పని సరి యగుచుండగా, సజ్జనుల, బోత్సహించి పలుకుబడి నపయోగించి పాఠశాలకు దివ్యభవన నిర్మాణము నకై 25 వేల రూ. వెలగల భూదానముఁ జేయించి మరియంత ధనవ్యయమున దివ్యభవనముఁ గట్టింప దీక్ష వహించిన దక్షుడవు.


పరోప కార పొరీణా!


నేఁ డాంధ్రాపని యందు తలజూపు ప్రతి సత్కారము ప్రత్వ క్షమునో, పరోక్ష ముసనో, మీ చేయూత నొందకుండ నుండ లేదనిన అతిశయోక్తి కానేరదు. పఠనాలయములు, వసతి గృహములు, ప్రార్థనా మందిరము లన్నియు మా సహాయ ముపేక్షించునవియే! వెలితలేని. యివి విసువులేని యుపకారము.


పరిపాలనా ధురీణా !


సగర రక్షా ప్రధాన పదవిఁబోలు, ఉన్నతస్థాన మలంకరించి సమాచీన కార్యనిర్వహణముఁ జేసి ప్రభుత్వము నలరించి పూజనీయమగు రాజాబహద్దూర్, ఓ. బి. ఇ. బిరుదముల నంది యాంధ్రుల కపార కీర్తి గడించి పెట్టిన ప్రధానాంధడవు; నిను గన్న యాంధ్రావని వీర మాత, నీ సోదరాంధ్రులు ధన్యులు.