పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

213


డెను. పటన్ సందు జరీతయారుచేయు వారలు ముఖ్యముగ మునల్మానులే యుండిరి. ఆ జరీ 'యేండ్లకొలదిగ వాడుకొనినను దాని మెరుపు, అందములో భేదము కలగకుండెడిది. అందువలన ప్రతి సంవత్సరమును బరోడా మహా రాజుల కడకును, పూనా, దమిష్కు మొదలగు దేశముకును లక్షల విలువగల వస్తుచయము పంపబడుచుండెను. ఇప్పుడు లక్షల వస్తువులు పోకున్నను వేల విలువగల వస్తువులయినను పోవుట అసంభవమైనది. దీనికి కారణ మేమన కాలానుసరణముగ మీజాతీయులు వస్త్రపరి శ్రమయందు మార్పులు జేయలేదు. ఇప్పటికిని పూర్వాచార పరాయణుగనే యున్నాడు. అందువలన నూతనశకపు యువతులును, యువకులును మీవస్తువును కొనుటకై వెనదీయు చుందురు. మీరు నూతన విధ వస్త్రమును తయాశచేయుట యేకాక అక్కడ వాని క్రయమునకై అడతీ దుకాణములను విచారించి తెరువ వలసి యుండును. ఈ కాలమున వస్తువుల యొక్క గట్టి దనమును విలువ విచారించువారలు లేరు. చాల కాలము వరకు పై మెరుగుగల వస్తువులను జనసామాన్యము మెచ్చుకొను చుండెను. ప్రస్తుతము ఆలేరులో వస్త్ర పరిశ్రమకయి తెరువబడిన కర్మాగారము నందు తయారుచేయబడిన వస్తువుల కెక్కువ క్రయమున్న దనియు, ప్రజలు మెచ్చుకొనుచు న్నారనియు తోచుచున్నది.