పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212


గొప్ప కళను ప్రోత్సహించి పర దేమునకు స్వదేశవస్తు విక్ర యమునకై సంస్థలు స్థాపించి వస్త్ర పరిశ్రమ సౌభాగ్యమును పెంపొందింప జేసి ఐశ్వర్యమును పొంగి పొరలునటుల జేయుయా దర్శముతో పశ్మశాలీయ మహాసభ యాజమాన్యమున ప్రదర్శస స్థానమెంతయు శుభప్రదముగ పరిణమించగలదు.


బీదతనము చేటను తగినంత ధనము లేనందునను మీ జూతికి జెందిన వారలు స్వవృత్తి యగు వస్త్ర పరిశ్రమను వదలి సామాన్యులు కూలినాలియందు మగ్నులై యుండుట దీనికి కారణము. పూర్వ కాలమున ప్రతిపల్లె మందును పద్మశాలీయు లుండెడివారు. ఆక్కడ పండిన ప్రత్తిని కర్షకుల కడ నుండి స్వీక రించుకొని బట్టల నేసి బీద సాదలకును, మధ్య మస్థితియందున్న వారలకును పిక్రయించు చుండిరి. కాని యీకాలమున చిన్న తసపు పెండ్లిండ్ల వలన బీదతనము చేతను కలిగిన దుర్బలము మూలమున మీ బరువైన దళసర మయిన బట్టలు మోయుటకై నను తగనివారైపోయిరి. అందముగ సగుపడు ఆధునిక వస్త్రముల నుపయోగించు నుత్సాహముకలవారై పోయినారు. పూర్వకాలమున విలువ గల పటన్ మరియు గద్వాల చీరలు గట్టిగనుండి తరతరముల వరకు వారసత్వమున వచ్చు చుండెడివి. అవ్యసరమును బట్టి విక్రయింప దలచినచో పరిశుద్ధ మైస జరీయుస్నందున సగముకంటె నెక్కువ వెల లభించుచుం