పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజా బహద్దరు

వేంకట రామా రెడి గారు ఓ. బి. ఇ.

యువశ్రావణ శు. 13

గోలకొండ పత్రిక


మోటారుకార్లు భుయ్, భుయ్, అని ఘీంకారాలు చేస్తూ వస్తూయున్నవి. ముసల్మానులు, గుజరాతీలు, మార్వాడీలు, అంధ్రులు ఒక్కొరొక్క రేవచ్చి వసారాలోని కుర్చీల మీద కూర్చుంటున్నారు. ఎనిమిదింటికి పది నిముషములుస్నది. తెల్లటిలాగు, కోటు వేసుకొన్న ఒక నౌకరు వచ్చి కాగితాల చుట్టను, పౌన్ టెన్ కలాన్ని, సులోచనాల జోడును బల్లమీద పెట్టి వెళ్ళిపోయాడు. సరిగా ఎనిమిది గంటలు కొట్టే సరికి బంగాళా లోపలనుంచి ఒకరువచ్చి బల్లదగ్గవున్న కుర్చీలో కూర్చున్నారు. వీరు రావటంతో నే కుర్చీలమీద కూర్చున్న వారంతా లేచి, , మొగలాయి పద్ధతిని ముమ్మారు తలవంచి, సలాముచేసి తిరిగి కూర్చున్నారు. బంగ్లాలోపలనుంచి వచ్చిన • పెద్దకు సుమారు 10 సంవత్సరాల లోపు వయస్సు, పరిమా ణంలో పొట్టి, కాస్త స్థూలశరీరం, నలుపురంగు, కుచ్చు వ్రేలా