పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

185


రెడ్డి విద్యాలయముతో నుండు వీటి సంబంధమునుబట్టి వీరు కేవల స్వజాతి పక్ష పాతులని వీరి నెరుగనివారే చెప్పవలయును- ప్రతి శాఖాభివృద్ధి మొత్తము సంఘమున కభివృద్ధి కరమగునదియే. వీరు రెడ్డి సోదరులకు నితర శాఖల వారి నంద రనొకే దృష్టితో చూడ వలయునని నిరంతరము బోధించు చుందురు. హాస్టలు నిబంధనలందును నిట్టి సూచన లేకలవు.


రెడ్డి విద్యార్థులు వీరిని సన్మానించినందులకు వారి చర్యను మేముభినందించు చున్నాము. శ్రీ వేంకట రామారెడ్డి గారి కృషివలననే రెడ్డి విద్యాలయము' దిన దినాభివృద్ధికి వచ్చు చున్నది. కొత్వాలు గారు తమ యుపన్యాసములో సెలవిచ్చి నట్టు శ్రీ దోమకొండ రాజు గారు, శ్రీ పింగిలి వెంకట రామా రెడ్డి గారు, ఇతర, మహారాజులు మున్నగువాగు ద్రవ్యసహా యము చేయకుండిన రెడ్డి విద్యాలయపు మాట మరచి పోపల సియే యుండును. అయినను శ్రీకొత్వాలు గారు దానికి జనరల్ సెక్రటరీగారగుటచే, ప్రతిదినము శ్రద్ధవహించిన వారగుటచే, నేటి కాలమున హాస్టలునుండి బి, ఏ., యఫ్. ఏ. మున్నగు నుత్తమ తరగతులలో విద్యార్థులు కృతార్థులగు చున్నారు సుమారు 10 సంవత్సరఘులకు పూర్వము 10 - 15