పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2


రును తమ తమ శక్తి కొలది తమ తమ ప్రాంతములలో సమాజోన్నతికి పాటుపడిన వారే. కొందరికి ఆ బాల్యముగా తమ శక్తి సామర్ధ్యములను ప్రకటించుట కవకాశము లుండును. రాజుల సంతతి వారును, కోటీశ్వరుల పిల్లలును, ఉన్నత పదవు లందు నారి సన్నిహిత బంధువులును, తమశక్తి సామర్ధ్యములు ప్రకటించి లోక కల్యాణమున కుపకరించిన వారైన అదియు గొప్ప విషయమే. కాని అంతకన్న గొప్ప విషయ మేమన ఆదిలో సాధారణ స్థితి యందుఁడి స్వీయ గుణముల చేతను స్వయం కృషి చేతను గొప్ప స్థితికి వచ్చిన వారి చరిత్ర లింకను రమణీయముగా నుండును. నెపోలియన్ చక్రవర్తి, ఆబ్ర హాంలింక, గార్ ఫీల్డు,చాణక్యుడు, హైదరలీ, క్రాంవెల్ , వీరేశలింగం, సోక్రటీసు, శంక రాచార్యులు ఇట్టి వారందరును ఈ ద్వితీయవర్గములో చేరిన వారు.

అమెరికా దేశములో ఇద్దరి మహాపురుషుల చరిత్ర చాల రమ్యమైనట్టిది. ఆబ్రహాం లింకన్, జనరల్ గార్ ఫీల్డు అను వారిరువురును పూరి గుడి సెలలో పుట్టి పెరిగి తుదకు అమెరికా దేశము యొక్క రాజ్యా ధ్యక్షులు (President) అయిరి. వీరిద్దరిని గురించి గార్ఫీల్డు చరిత్ర కారుడు (From log-cabin to white House అ ను గ్ర 0 థ ములో) ఇట్లు వాసి యున్నారు: