పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

165


పంపినారు. తమతల్లి గారి గ్రామమగు రాయణి పేటనుండి వచ్చిన పేద వారిని సత్కరించు చుందురు. తనకన్న వృద్ధుడైన యొక బీద కాపొక మారు వచ్చినప్పుడు అతనిని అత్యంతముగా గౌరవించి పంపినారు. తమతండ్రిగారి జన్మభూమి యగు గద్యాలలో రెడ్డి కొంత స్థిరాస్తి యుండెను. వీరితడ్రిగారగు కేశవ రెడ్డిగారు కొన్ని గ్రామములకు పటేలును గొప్ప ధనికులునై యుండిరి . కాని వారు చాల ఉధారు లగుటచేత గోపాలు పేట సంస్థానము వారికి 40,000 రూపాయీల అప్పుడు ఇతరులకు వేకొలదిగా అప్పును ఇచ్చి యుండి అవన్నియు వసూలుకాక ములిగియే పోయెను. పటేలు గిరీలపై రెడ్డిగారు కభిమాసము లేనందున అవియు నూడిపోయెను. కొంత పట్టా భూమియు ఇనాములును మిగిలి యుండగా ఆ శేషమునుగూడ రెడ్డి గారు తమ దాయాదులును, గద్యాలలో పోలీసు, మాలు, పటేలిగిరి చేయునట్టివారును : గువారికి ఉచితముగా పంచియిచ్చినారు. మరియు తమ జన్మభూమియగు రాయణి పేట లోని బంధువర్గములోచేరిన బీద బాలురకనేకులకు వీరు స్వయముగా భుక్తికి బట్టలకును ద్రవ్య మిచ్చి అనేక సంవత్సరములు సగరములో చదివించినారు. ముఖ్యముగా విలియం వహబు గారి మనుమలపై వీరికి చాల ప్రీతి. వారందరికిని చాల సహాయము చేయుచు వచ్చినారు. విలియం వహబుగారి వంశము వారిని తన వారికన్న హెచ్చుగా చూచుకొనుచు వచ్చినారు.