పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి ప్రకరణము

విషయ ప్రవేశము

ప్రపంచములోని మహాపురుషుల చరిత్రలు నానా విధములుగా నుండును. అవన్నియు పాఠకులకు కొన్ని గుణపాఠములు నేర్పునట్టివై యుండును. జీవిత చరిత్రలు వ్రాయు నాచారము పాశ్చాత్యులలోనే విశేషము. వారినుండియే యీ విషయమును భారతీయు లనుకరించుచున్నారు. జీవితచరిత్రలు వ్రాసి యుంచుట వలన ముందు సంతతివారికి తమ పూర్వుల లోని గొప్పవారి చరిత్రయు ఆ చరిత్రలోని ఆదర్శ విషయములును ఆ చరిత్రకు కారణభూతములైన మహాపురుషుల కాలములోని కొన్ని ముఖ్య ఘట్టములను:— ఇటువంటి అనేక విషయములు తెలిసికొనుట కవకాశ మేర్పడును.

ప్రపంచమందలి మహాపురుషు లనేక విధముల వారై యున్నారు. సేనానులును, రాజులును, రాజకీయ వేత్తలును, కవులును, మతకర్త లును, సంఘ సంస్కర్తలును. పరోపకారులును — మహాపురుషులు పలుతెరగులుగా నుందురు. వీరంద