పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164


ఒకని పై మంచి అభిప్రాయము కలిగిన సాధారణముగా దానికి విరుద్దముగా ప్రబల కారణములు వారికి గోచరించిన నేతప్ప తమ అభిప్రాయముసు మార్చుకొనరు.


సాధారణముగా ఇంతయో అంతయో విద్యాసంస్కారముకల నవనాగరిగలును, ఇటులో అటులో ద్రవ్యమును సంపాదించుకొన్న ధనికులును, చిన్నదో పెద్దదో ప్రభుత్వో ద్యోగమును ముస్పతిప్పులు పడి సంసాదించుకున్న ఉద్యోగులును, నైనట్టిజనులు విద్యాగంధ రహితులను, పేదవారిని, పల్లెటూరివారిని, మోటు వారిని చూచి వారనాగరికులని భావించి దగ్గరకైనను రానీయరు. వారితో మాట్లాడిన గౌరవము పోవునేమోయని యనుకొందురు. కాని వేఁకటరామా రెడ్డిగారు కొత్వాలీ పవవిముకటి గొప్ప ఉద్యోగము నందుండియు, ఎట్టివారు వచ్చినను ప్రీతితో ఆదరించి దగ్గరకుతీసి బుద్దులు చెప్పి, సహాయముచేసి పంపుదురు, తమతో చిన్న నాడు తెనుగు బడిలో చదువుకున్న ఒక బీద కాపు వార్ధక్యదశలో వచ్చికలి సెను. అకడు కడుబీద వాడైనను, ఎన్ని యో యేండ్ల యనంతరము అనగా అర్ధశతాజ్ఞానంతరము వచ్చినను అతని నాదరించి, తన పంక్తి లో దిసము భోజనము చేయించి, మంచిబట్టలిచ్చి, ఒక మాసము వరకు తనవద్ద నుంచుకొని సెలవు తీసికొని పోవునప్పుడు కొత్త బట్టలు కట్టించి కొంత ద్రవ్యమిచ్చి