పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160


వస్తువులును వారి బల్లపై నిండియుండును. తమతో కూడ కూర్చున్న వారికి కడుపునిండుగా భుజించుటకై స్వయముగా ప్రోద్బలము చేయుచుందురు. నాజూకు వారు అజీర్ల బాధను పొంచక మానరు. సుమారు ఎనిమిదిన్నర గంటల కాలముప్పుడు బట్టలు వేసికొనిబయటికి వత్తురు


బయటి పెద్దహాలులో జనులు క్రిక్కిరిసియుందురు. సిఫారసులకు వచ్చినవారు, ఊరక కలిసిపోవుటకు వచ్చిన వారు, రాజులు, నవాబులు, రాజకీయములలో ఆలోచనలు చేయుటకై వచ్చినవారు, ధనసహా మార్గము వచ్చిన బీద వారు, చేతి క్రింది ఉద్యోగులు, చందాలకై వచ్చిన వారు, బ్రిటిషిండియానుండి కార్యార్ధులై వచ్చినవారు, రెడ్డి గారి పాలనలోనుండు వివిధ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు, హిందువులు, ముసల్మానులు, అన్ని విధములవారును అచ్చట చేరియుందురు. వారందరితోను ఒక అర్ధగంట లేక గంటకాలము మాట్లాడి పంపి వేసి తమ యితర వ్యవహారములను చూచుకొందరు. ఏయే కమిటీ పనులుండునో అవి 11 గంటలలోపల ముగించు కొందురు. తర్వాత కొత్వాలీ పనికాలములో 11 గంటలవరకు కచ్చేరీకి వెళ్ళి మధ్యాహానంతరము 2 గంటలవరలో 3 కొట్టువరకో కచ్చేరీ పనులు చూచుకొందురు. మూడు గంటలకింటికి వచ్చి భోజనము చేయుదురు.