పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పదునొకండవ ప్రకరణము


గుణవిశేషములు.


రెడ్డిగారు ప్రతి దినమును ప్రాతః కాలమున 5 గంటలలోపలనే నిద్రనుండి మేల్కొని పత్రికలు, ముఖ్యమగు కాగితములు, గ్రంథములు చదువుకొందురు. వారు చదువదలచిన పత్రికాదులన్నియు వారి మంచము ప్రక్కననే యుంచుకొని యుందురు. 2 గంటలు కొట్టువర కీప్రకారము చదువుకొనిన తర్వాత కాల్యకృత్యములు తీర్చుకొని స్నానముచేసి ఏకాంత ములో పరమేశ్వర ధ్యానము చేసికొందురు. 8 గంటలవరకు పూర్తి చేసికొని తేనీరు ఫలాహారముకు తీసుకొందురు. ఆ సమయమున బయట తమ కొరకై యెరిగిన వారెవరైన వచ్చినారా చూడుమని ప్రతిదినము మరువకుండ సేవకులకు చెప్పుచుందురు. వారితో విశేషముగా వచ్చి కలిసిపోవు వారిని తమతోకూడ తేనీరు త్రాగుటకు పిలుతురు. వారిభోజనము రాజభోజనము, సాధారణముగా నానావిధముల మధుర పదార్థములును వివిధ ఫలములును ఇతరలోభనీయ భోజ్య