పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

157


సంవత్సరములు విద్యాభ్యాసముచేసి బ్యారిష్టరు అయివచ్చి నారు. స్వదేశమునకు తిరిగి వచ్చిన కొంత కాలమునకు వారు మద్రాసులో కొంత కాలము పని నేర్చి హైదరాబాదు 'హైకోర్టులో సర్కారీ వకీలుగా (కౌన్సిల్ గా) నెలకు 200 రూపాయిల జీతము పై నియమితు లైనారు. ఇట్లు కొన్ని సంవత్సరములు గడచిన తర్వాత వారిని ప్రభుత్వము వారు అడిషనల్ సెషంస్ జడ్జి పదవి పై నియోగించినారు. ఈ పదవిని తర్వాత సెష జడ్జి అయిన మూడు నాలుగు సంవశ్చరములు నిర్వహించిన తర్వాత హైకోర్టు జడ్జిపదవి పై నియుక్తులైరి. ఆచ్చట మండి స్వతంత్రులైన న్యాయమూర్తులని పేరుపొందినారు. ఇటీవలనే వారిని జూడిషియల్ కమిటీ రుకున్ గా ఏర్పాటు చేసి యున్నారు.


శ్రీ లక్ష్మారెడ్డి గారు ఇంగ్లాండు నుండి వచ్చు నప్పుడే ఆంగ్లకన్యకను వివాహమాడినారు. వారితో ఇరువది సంవత్స రములు పైగా సంసార సౌఖ్య మనుభవించినారు. ఆమె చాల ఉత్తమ గృహిణిగాను, స్త్రీ జనోద్యయములందు మంచి సేవా సక్తి కలవారు గాను ఉండినారు. సుమారు మూడు సంవత్సరముల క్రిందట ఆయమ్మ మరణించెను.