పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

153


శాలహరణార్ధము పిల్లనగ్రోవిపై పొడుదురనియు, దేవుడు కూడ సంగీతముతో కూడిన భజనచే పశీకృతుడగుననియు, ఇంకను. నెన్నియో యిట్టి యుపమానములనిచ్చి తను అఖండ లోకానుభవమును ప్రకటించి అందరిని ఆశ్చర్యములో తన్మయులగునట్లు గాచేసిరి.


వీరి యుపన్యాసములలో మంచి ఉత్తమమైన హాస్యరసముందును, వీరు తమ ప్రజాహిత కార్యములలో సహాయపడిన వారి నెవ్వరిని మరచిపోరు. సభా వేదికలపై వారికి సుకుమారముగా తమకృతజ్ఞతను వెల్లడింతురు. ఎట్టి క్లిష్టనమస్య లైనను సరే, చర్చించి, ప్రతి పక్షులలో నిండి యుండిన అనుమానము లను, ద్వేషములను సహితము పటాపంచలగునట్లుగా వివరించి విమర్శించి సమర్థించి మెప్పింతురు. వీరివక్తృత్వమును గురించి ఖాజూహసన్ నిజామీగారు ఒక మారు ఇట్లు మిత్రులతో సెల విచ్చివారు " నేను హిందూస్థాన మంతటను వేలకొలది ఉపన్యాసములను వినినాను. రాజాబహద్దరువలె సర్వపక్షముల వారిని మెప్పించునట్లుగాను చమత్కారము గాను ఉత్తమ శ్రేణిలో నుపన్యసించు వ్యక్తులనేను చాల అరుదుగా చూచినాను. ఈతడు అసాధారణ ప్రజ్ఞావంతుడు "