పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152


ధర్మములో ది; పత్రికలు చదువుటయు, ప్రభుత్వ నివేదికలను చదువుటయు, వారికి అలవాటు- అట్లు విజ్ఞాన సంబంధమగు గ్రంథములు బహుళముగా చూచుటకు వారి కవకాశము లభింప కుండినను వారికి విశాలమైనట్టి లోకానుభవము లభించినది. మద్యపానము గురించి మాట్లాడుదురు. విద్యార్థులకు ఉపదేశములు చేయుదురు. బాలికలకు బుద్దులు చెప్పుదురు. సహకారమును గురించి ముచ్చటింతురు. అస్పృశ్యతా దోష నివారణనుగుంచి బోధింతురు. వ్యాయామములను గురించియు ఆరోగ్య సాధనమును గురించియు ఉపన్యసింతురు. సంగీతమును గురించికూడ మంచి పరిశోధనతో కూడిన ఉపన్యాసమిత్తురు.


ఒక తడవ శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయములో మనోహరబర్వే అనుసుప్రసిద్ధ బాలగాయకుని సమ్మానించిన సందర్భములో రాజాబహద్దరుగారు అధ్యక్షులుగా నుండిరి. పోలీసువారి కేమి సంగీత సంబంధ మేమి? అని యందరకును విచిత్రము గానే యుండెను. కాని వారు సంగీత ప్రాశస్త్యమును గురించి ఒక గంట కాలము మనోహరముగా నుపన్యసించిరి. ఎద్దులు వడిగా నిరాయాసముగా నడుచుటకై గజ్జెలు గంటలు కట్టుటలోను సంగీత ప్రాధాన్యతయే యున్నదనియు "బాలురను తల్లిజోకొట్టు నప్పుడును గానమే చేయుననియ, పసుల బాలురు