పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

151


లకు కూర్చున్నాము. రకరకాలైన పండ్లును, మిఠాయీలు, బల్లమీదనున్నవి. రాజ సాహేబు గారు అప్పుడు చేసిన ఆదరము, బెట్టు లేనిచనువు నెరపడముచూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ మహా పురుషుణ్ణి గూర్చి ఒక్కమాట చెబితే అంతా చెప్పిన ట్లౌతుంది. అది యేమిటంటే నేనొకరోజున రెడ్డి హాస్టలులో ఉపన్యాసమిస్తూ ఉండగా, వారు లోనికి వచ్చారు. సభలో అయిదారు వందలమంది జనమున్నారు. వారు వచ్చినంతనే ఆరువందలమంది ఒక్కసారి లేచి నిలుచున్నారు. ఇటువంటి గౌరవము మా దేశములో ఎవ్వరికీ జరుగదు. నేను ఒక్క నిముసం దిగ్ర్భాంతుడనై పోయి మళ్ళీ ఉన్యాస మారంభించు కొన్నాను. వారు నేనిచ్చిన రెండుమూడు ఉపన్యాసములకు దయచేశారు. చాలా సేపు కూర్చున్నారు కూడాను. అంత సేపు కూర్చోరని యెవరో చెప్పగ విన్నాను. దానికి నేను కృతజ్ఞుడను. "


రాజాబహద్దకు రెడ్డిగారు సభలో మాట్లాడుటకు నిలిచినారనిన సభయంతయు ఆనందముతో నిరీక్షించుచుండును. వారు ఉర్దూలో అనర్గళధారతో జంకుకొంకు లేక మంచి ధారాశుద్ధితో సుపన్యసింతురు. ఎటువంటి సమస్యావిషయ ముననైనను హాస్యరస ముట్టిపడునట్లుగా మాట్లాడుదురు. వారు గ్రంథ పరిశోధనములు చేసిన వారుకారు. ఉద్యోగ