పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150


ఉక్కిరిబిక్కిరిగా స్థబ్దులై నిలిచిపోవుదురు.వేంకట రామారెడ్డి గారు అట్టి శ్రేణిలోనివారు కారు. వారియందు హిందువులకే కాక మహమ్మదీయులను సంపూర్ణమగు గౌరవము కలదు. వారుసభలో ప్రవేశించగానే అందరును లేచనిలుచుకొని కొని గౌరవింతురు. ఈ విశేషమును విశ్వనాధ సత్యనారాయణ గారను సుప్రసిద్దాంధ్రకవులు హైదరాబాదు నగరములో ఉపన్యసించు చున్నప్పుడు తాము స్వయముగా చూచి చాల ఆశ్చర్యపడి పోయినారు.

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ ఎం. ఏ. గారు 28 సెప్టెంబరు 1936 నాడు గోలకొండ పత్రికలో “ హైదరా బాదులో పక్షముదినములు" అను వ్యాసమందు రాజా బహ ద్దరుగారిని గురించి యీ విధముగా వ్రాసినారు.


"ఒక రోజు పొద్దున ప్రతాప రెడ్డి గారు శ్రీ శ్రీ రాజా సాహేబు కొత్వాల్ వేంకట రామారెడ్డి బహద్దరుగారి సన్నిధికి తీసుక వెళ్లారు. రాజా వేంకటరామారెడ్డి గారు వృద్ధులు. వార్దక్య ము వారి శరీరమందున్న దేమోకాని ఆ మొగములో యవ్వనమే తాండవిస్తుంది.ఠీవి, దర్జా, ప్రసన్నత్వం ఆయన ముఖంలో కొట్టవస్తున్నవి. వారి యిద్దరుకుమారులు, శ్రీ దోమకొండ రాజుగారు, మేమున్ను పాతః కాల ఫలాహారము