పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

145


పరోపకారణీ బాలికా పాఠశాల.

హైద్రాబాదు నగరములో ఈ బాలికా పాఠశాల ప్రైమరీ తరగతి వరకు స్థాపించినారు. దాని పాలక వర్గమునకు అధ్యక్షులు శ్రీ రెడ్డిగారే. ఇదియు మంచి స్థితిలో సడుప బడుచున్నది. ఈ పాఠశాలలో నిప్పుడు సుమారు 60 , 70 బాలికలు తెనుగులో విద్య నేర్చుకోనుచున్నారు.


ఎక్సెల్ సియర్ మిడిల్ పాఠశాల

ఈ పాఠశాలలో విశేషముగా తెనుగు బాలురే చదు వుచున్నారు. దీని పాలక వర్గమునకు అధ్యక్షులు శ్రీ రెడ్డి గారే. వారి అధీనములో ఈ పాఠ శాలయు నడుపబడుచున్నది. ఈ పాఠశాలా విషయముస స్థానికాంధ్రులు ఎక్కువ, అభిమానము చూపని కొరత యొక టిగలదు, ఆంధ్రులీ పాఠశాల పై మంచి అభిమానము చూపినట్లైన కొన్ని సంవత్స రములలో ఇది హైస్కూలుగా మారి మంచి ఆంధ్ర సంస్థగా నుండగలదు.


స్త్రీలక్లబ్బు. (శాస్మ పొలిటన్ క్లబ్బు)

నగరములో బొగ్గులకుంట సమీపమున మహిళా సంఘము పేర నొక గొప్ప బంగ్లా కట్టబడియున్నది. దాని నిర్మాణమునకుగాను రాజబహద్దరుగారు రాజసర్ బన్సీలాలు గారిని ప్రోత్సహించి వారివలన సుమారు రూ 15,000 ను