పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144


కిబ్బంది యుండెను. ఈ లోపమును నివారించుటకై శ్రీరెడ్డిగారు రమారమి 2 సంవత్సరముల క్రిందట రెడ్డి బాలికల హాస్టలు నొక దానిని స్థాపించిరి. స్థాపనోత్సవమునాడే నగరపు ముఖ్యులు సుమారు 3000 రూపాయిల విరాళముల నిచ్చిరి. ఈ ద్రవ్యసహయముచే మంచిబంగ్లా అద్దెకు తీసుకొని హాస్టలు కార్యమారంభించిరి. కొన్ని మాసములలోనే సుమారు 125 మంది బాలికలు అందులో చేరిరి,. ఆ వసతి మందిరములో మంచి సౌకర్యముల నేర్పాటు చేసినారు. కేవలము రెడ్డి బాలికలే కాక వెలమ నాయుడు మున్నగు కులముల బాలికలును అందుచే లాభమందుచున్నారు. బాలికలను పాఠశాలకు బండ్లలో తీసుకొను పోవుటకు వారిని విచారించు కొనుటకొక ఆంగ్లో ఇండియఁ స్త్రీని, ఏర్పాట్లు చేసినారు. బీద బాలికలకు ఉచితముగా భోజనము నిచ్చుచున్నారు. ఈ బాలికల హాస్టలునకు కూడ నొక సొంత భవన మవసరమని తలచి బాలికల ఉన్నత పాఠశాలా భవనముప్రక్కననే నొక విశాల భాగమును 5,000 రూపాయీలకు కొని పెట్టియుంచి నారు. అందు భవనము నిర్మించు ప్రయత్నములో నున్నారు. రెడ్డిగారు చేసిన యితర కార్యముల వలెనే ఇదియు త్వరలో సాధింపబడు ననుటలో సందేహము లేదు.