పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

143


ఎంత కాలము నడిపినను పాఠశాలకు స్థిరత్వ మేర్చడదని గ్రహించి శ్రీ రాజా బహద్దరుగారు దానికొక మంచి భవనము కట్టించుటలో శ్రద్ధాళు లైరి. బాలికల ఉన్నత పాఠశాల కై రెడ్డి గారి ప్రయత్నములచేత సుమారు 35,000 రూపాయిల చందాలు వసూలయ్యెను. గత సంవత్సరము నారాయణ గూడాలో రెడ్డి గారి బంగ్లా వెనుక భాగములోనే ఒక విశాలమైన ప్రదేశములో నూత్న భవనము పూర్తియై యిప్పుడం దే పాఠశాల నడిపింపబడు చున్నది. పాఠశాలలో ఇప్పుడు దాదాపు 400 బాలికలు విద్య నభ్యసించు చున్నారు. మెట్రిను తరగతి వరకు విద్య గరిపి పరీక్షలకు పంపు చున్నారు. ఇంతేకాక బి. ఏ. తుగతి వరకును చదువు నుత్సాహము కల బాలికలకు ప్రైవేటు విద్య చెప్పించి వారిని పరీక్షల కంపుచున్నారు. ఈ రీతిగా కొందరు యువతులు బీ. ఏ. పరీక్షలో కడ తేరినారు.


రెడ్డి బాలిక ఆ వసతిమందిరము

రాజాబహద్దరుగారు బాలికల ఉన్నత పాఠశాల యొక్క పాలక వర్గములో అధ్యక్షు లైనత ర్వాత వారిదృష్టి బాలికల వసతి మందిరము విషయమున ప్రసరించెను. జిల్లాల లోని గ్రామాలనుండి కొందరు బాలికలు ఉన్న తవిద్య నభ్య సించుటకై నగరమునకు రాగోరిరి. కాని వారి భోజనవసతుల