పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142


షకు ప్రాధాన్యతనిచ్చి యుండినందున బాలికల మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చి స్థాపించిన కారణమున విద్యాపీఠాధికారులు ఆ పాఠశాలకు తమ విద్యాపీఠ మందు స్థానమిచ్చి అంగీకంతురని నమ్మి పాఠశాల కార్యనిర్వాహక వర్గము వారు విజ్ఞప్తి సమర్పించుకొని నారు. కాని ఉస్మానియా విద్యా పీఠము వారు బాలికల ఉన్నత పాఠశాలలో ఉర్దూభాష ద్వారా పాఠములు నేర్పుటలేదను కారణము చేత అంగీకారమును ( Recognition ) ఇచ్చుటకును నిరాకరించినారు. అదేకారణము చేత ద్రవ్య సహాయముకూడ చేయుటకు వీలు లేదనిరి. పునర్విజ్ఞప్తు లంపుకొన్నను ప్రభుత్వము వారి ద్రవ్యసహాయము లభించి యుండ లేదు. తుదకు బాలికల ఉన్నత పాఠశాలను బొంబాయి రాజధానిలోని పూనా నగరములో కర్వే మహా శయులచే స్థాపింపబడిన మహిళా విద్యా పీఠము, జతచేసి అచట అంగీకారమును పొంది వారిచే మెట్రికు పరీక్షా పట్ట ములను బాలిక లకిప్పించి ఈ పాఠశాలను నడుపుచున్నారు,ఇట్టి పాఠశాల యొక్క పాలక వర్గమునకు శ్రీ వేంకటరామా రెడ్డి గారు అధ్యక్షులైరి. వారు ప్రతి విషయమునను మంచిశ్రద్ధను వహించి మంచి సలహానిచ్చుటయేకాక స్వయ ముగా ద్రవ్యహాయము చేసియున్నారు. బహుకాలమా పాఠశాల ఒక అద్దెంటిలో సడుపబడుచుండెను. కానిఅట్లు