పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

141


బాలికల ఉన్నత పొఠశాల


మొత్తము హైద్రాబాదు రాష్ట్రములో మన బాలికల మాతృభాషలో విద్య చెప్పించునట్టి ప్రభుత్వోన్నత పాఠశాల లేక పోవుట దేశీయుల దురదృష్ట విశేషమని యైనను చెప్పవలసి యుండును. ఈ లోపమును నివారించుట చాల యవసరమనిపించెను. ప్రభుత్వము వారు స్థాపించిన ఉన్నత పాఠశాలలో ఉర్దూకో, ఇంగ్లీషకో ప్రాధాన్యత ఇయ్యబడినది. ఈ రాష్ట్రములోని ప్రత్యేక పరిస్థితులలో విద్యా సమస్య చాలచిక్కులతో గూడినదైనది. అందులో బాలికల విద్య మరింత ఆశ్చర్యకరమైనట్టిది. ఉర్దూభాషలో ప్రధానముగా ఉన్నత విద్యాభ్యాసము కాక్షించుటచే ఉర్దూ మాతృభాష కాని బాలికలకు గొప్ప కష్టముగా నున్నది. ఆకారణము చేత హైదరాబాదు నగరములోనై నను ఒక బాలికల ఉన్న తపాఠశాలను మనబాలికల కొరకేర్పాటు చేసిన బాగుండునని స్త్రీ విద్యాభిమానులగు శ్రీ మాడపాటి హనుమంత రావుగారికిని మరయితర ప్రముఖులకుమ తోచినది. అట్టి దృక్పథముతో వారొక బాలికల పాఠశాలను స్థాపించిరి.మొదటి ఫారము తరగతితో నారంభమై కొన్ని యేండ్లలో క్రమ క్రమముగా ఉన్నత పాఠశాల అయినది. ఉస్మానియా విద్యాపీఠము వారు ఇంగ్లీషునకు మారుగా ఒక దేశీయభా