పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

139


కూడ నయ్యెను. దానికి 85,000 రూపాయలకు పైగా పట్టెనని తెలిపియే యున్నాము. ఇట్లే యితగ విషయములందును జరుగుచు వచ్చినది. రెడ్డి గారి యీ విజయముల రహస్యమేమి యని విచారిం చవచ్చును. ప్రచండమైన సంస్థలను నడిపించు వారిపధ్ధతులు మనోహరముగా నుండును. రెడ్డి గారిదొక సిద్ధాంతము ముఖ్యమైన దిగానున్నది. “మనమే మెనమేమైన ప్రజాహితకార్యము చేయదలచిన ఏమియును ప్రారంభిపక ముందే ప్రజలను ద్రవ్య సహాయము చేయుమని విచారించిన అందు మనకు విజయము లభిపదు. మసమాపనిని ప్రారంభించి ప్రజలకు మనము చేయుచున్న పనిని చూపించి సహాయము చేయుటకై విచారించిన అప్పుడు అనాయాసముగా ద్రవ్యము లభింపగలదు'. అని శ్రీ రెడ్డి గారు పలుమారు చెప్పెడి వారు. అదే పద్ధతిపై వారె బంగ్లాను ప్రారంభించినను సరే దాని శంఖుస్థాపస మొక పెద్ద మనుష్యునితో వేయింతురు. ఆట్లు గౌరవింపబడిన వ్యక్తి కొంత ద్రవ్యమును ఇచ్చును. దానితో పొదులు పూర్తి అయినట్లే! తర్వాత ప్రతి ధనికుని గూడ “మానూతన భవన నిర్మాణమును తిలకించి ఆశీర్వదించ రండి” అని వారి కాస్థలమును చూపించుచుందురు. వచ్చినవా రందరును ఏదో కొంత సహాయము చేసి పోవు చుందురు. ఈ ప్రకారముగా పనిసాగుచు పూర్తియగును. ఇట్టి చాకచక్య