పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138


గతులలో పరీక్షలంచుత్తీర్ణులై మంచి ఉద్యోగములు పొందినారు. పేరు రెడ్డి హాస్ట లేకాని ఇందు 'రెడ్డి బాలు రేకాక వెలమ, కమ్మ విద్యార్థులు ను ఎందరో చేరి లాభము పొంది నారు. మరియు నాయుడు, మొదలియార్ . పిళ్ళై, ముసల్మాను మున్నగువర్గము వారును చేరినారు. ఇటీవల అదే రెడ్డి హాస్టలులో బీద బాలురకుగాను " అనాథాలయము" అను పేరుతో ఒక శాఖ యేర్సా టుచేసి ఉచిత భోజనవసతు లేగ్పాటు చేసినాము.


ఈ రెడ్డిహాస్టలు అభివృద్ధి చరిత్రలో వేంకటరామా రెడ్డి గారి సిద్ధహస్తము అంతటను సువ్యక్తమగుచున్నది. వారు హాస్టలు భసనముల ఖరీదు చేసిన తర్వాత నిలువ ధనమంతయు వ్యయమైపోయెను. భోజనశాలను కట్టించుటకు చేతిలో ద్రవ్యము లేదు. కాని దానికై 25,0000 రూపాయలు పట్టినను దానిని పూర్తి గావించిరి. మొట్ట మొదలు విద్యార్థులే ఒక చిన్న గ్రంథాలయమును "శారదా నికేతనము" అను పేరుతో ఏ నాలుగైదు వందల పుస్తకములతోనో ప్రారంభించిరి. కాని రెడ్డిగారి శ్రద్ధచే రెండు మూడేండ్లలోనే గ్రంథములసంఖ్య పెరుగుచు పెరుగుచు క్రమక్రమముగా 11000 వరకు వృద్ధి నొందగా దానికొక ప్రత్యేక భవసమే అవసరమయ్యెను. కాని చేతిలో ఏమియు ద్రవ్యము లేకుండెను. గ్రంధాలయ భవనము ప్రారంబమేమో అయ్యెను. ఒక సంవత్సరములోగా పూర్తి