పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

137


మించినట్టిది వేరెందును, లేదు. ఇంతేకాక రెడ్డి బాలురకు వ్యవసాయవిద్యయందు శ్రద్ధ కలుగుటకును, రెడ్డి హాస్టలునకు కూరగాయలు సప్లై అగుటకును 5 ఎకరముల తోటను, ఒక చిన్న, బంగ్లా యుక్తముగా రూ, 6 000 లకు ఖరీదు చేసినారు. అది హుసేను సాగరు చెరువు క్రిందకలదు. దానికి "రెడ్డి బాగ్ అని నామకరణము చేసినారు. ఇప్పుడు రెడ్డిహాస్టలునకు నెలకు సుమారు 100 రూపాయీల కూరగాయలు ఖర్చగుచుండును. అందు సగమువరకు క్రయముచేయు కూరగాయలు ఈ బాగునుండియేవచ్చు చుండును. రెడ్డి విద్యార్థులు సెలవు దినములలో అచ్చటికి వెళ్ళి తోటపనులలో పాల్గొనుచుందురు.


రెడ్డి హాస్టలులలో బాలురకు వ్యాయాయములందు శ్రద్ధగల గుటకై మంచిస్థలము ఏర్పాటుచేసి బంతి ఆటలను, క్రికెటు హాకీ మున్నగువాని నే కాక, ముగ్దర్లు, మొదలగు కస్రశు వస్తువులుకూడ ఏర్పాట్లు కావించి ప్రత్యేకముగా వ్యాయామశాలలను కట్టించినారు.


హాస్టలులో స్కౌటుశాఖను కూడ ఏర్పాటు చేసినారు. 40 - 50 మంది విద్యార్థులు స్కౌట్లుగా ఏర్పడి పోటీలలో అనేక బహుమతులంది ప్రసిద్ధి గాంచినారు.


ఈ రెడ్డిహాస్టలులో వందలకొలది బీద విద్యార్థులకు ఉచితముగా భోజనము లభించుచున్నది. ఎందరో ఉత్తమ తర - -