పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136


పరిశీలనము చేసి వెళ్లిపోయిన తర్వాత నిజామిగారు తాము ప్రచురించునట్టి ఉర్దూ వార పత్రికలోనిట్లు వ్రాసినారు. “నాకు రెడ్డిహాస్టలు విషయమై చిత్ర విచిత్ర వార్తలు తెలిసియుండెను. ఎన్ని యో కత్తులను తెప్పించి బాలురను సిద్ధము చేయుచున్నా రనికొందరు తెలిపినారు. నాకాహ్వానము వేంకట రామా రెడ్డి గారు చేసినప్పుడు అచ్చటికి వెళ్లి పొయఖానాలు, భూగృహము, ప్రాతగదులు, మూలమూలలో గదులు ఏదియును విడువ కుండ చూచినాను. వేకట రామా గెడ్డిగారు నా పరిశోధనలోని యర్దమేమో తెయక ఆశ్చర్యపడు చుండిరి. నాకిప్పుడు సంపూర్ణముగా తృప్తి కలిగినది. అట్టి అబద్ధ ప్రచారమును సరిపడని వారు గెడ్డిగారి విషయమునను వారి హాస్టలువిషయమును చేసి నారని దృశపడి "


శ్రీ రెడ్డి గారికి గ్రంధములందు అత్యంత ప్రీతి. వారిశ్రద్ధ వలననే రెడ్డిహాస్టలులో 11,000 గ్రంథాలు సేకరింపబడెను. అందనే కములు అపురూపమైనవిగాను, విలువగలవిగాను నున్నవి . హైద్రాబాదునగరములో ప్రభుశ్వము వారి ఆసఫియా గ్రంధా లయములో 15,000 గ్రంధాలకన్న ఎక్కువగా లేవు. ఒక ప్ర జాసంస్థలో 11,000 గ్రంథములు ఉండుట ఎంతయో గొప్ప విషయము. సర్కారీ గ్రంథాలయమును, కాలేజీల గ్రంథాలయ ములును తప్పిన , రాష్ట్రములో ఈ రెడ్డి గ్రంథాలయమును