పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

135


ప్రక్కన నే మరొక బంగ్లాను 2 జూన్ 1927 సం!లో 20,000 రూపాయీలకు కొనినారు. 1346, ఫసలీలో రూ 10,000 వరకు ఖర్చు పెట్టి వైద్యశాలయు, ఆతిధి గృహమును కట్టించినారు. విద్యార్థుల సంఖ్య 160 వరకు హెచ్చెను.


ఈ ప్రకారము రెడ్డిహాస్టలు దినదినాభివృద్ధి నొందు చుండ కొందరు ఓర్వలేని వారు దాని పై లేనిపోని అపోహములు కల్పించిరి. రెడ్డిగారు రెడ్డిహాస్టలులో బండ్లకొలది ఆయుధములను తెప్పించి యుంచినారనియు విద్యార్థులకు వాటితో యుద్ధములు చేయుటకు నేర్పించి నారనియు ఇట్టివిచిత్ర కథలనుకొందరు మతావేశపరులు వ్యాపింప జేసినారు. ముసల్మానులలో పేరు పొందినట్టి హజరత్ ఖాజాహసన్ నిజామా అనువారు ఒకతడవ రెడ్డిగారి ఆహ్వానము సంగీకరించి హాస్టలును దర్శించినారు. వారు ప్రతివస్తువును పరిశీలించి చూచినారు. భూగృహములు శోధించినారు. “అది పొయఖానా? అని చెప్పిసను దానినికూడ చూచినారు. "అవిస్నానపుగదులు అని చెప్పగా గదులనన్నింటిని పరిశోధించినారు. ఆ కొట్టిడీలో ప్రాతసామాను వేసినారు.. అనినంతనే సామానుల నన్నింటిని తొంగితొంగి చూచినారు. "ఆగదులందు విద్యార్డులు దేహపరిశ్రమచేయుదురు" అని పలికీ పలుకక మునుపే ఆ గదులను ప్రత్యేకముగా తెరిపించి చూచినారు. ఇట్లు సూక్ష్మ