పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134


ధరుగారు గావించినారు. సంవత్సరాంతము లోపలనే 54 గురు విద్యార్థులు వచ్చిచేరిరి. అంతలోననే ఉల్లాసమ్మెక్కువగటచే " రెడ్డి హైస్కూలు"ను కూడ స్థాపించి రెండేండ్ల వరకు నడిపి నారు, కాని దానివలన నష్టమే కలుగుట చేతను ప్రభుత్వ పాఠశాలలే విరివిగా నుండుట చేత ఈ నష్టవ్యవహారముతో నవసరము లేదని తోచినందుసను ఆపాఠశాలను తీసి వేసి కేవలము 'రెడ్డి హాస్ట సందే శ్రద్ధ కేంద్రీకరించిరి. స్థాపితమైన నాటి నుండి నేటి వరరకును దానికి రెడ్డిగారె ప్రధాన కార్యదర్శిగా నున్నారు. ఇతరు లెందరున్నను ఈ హాస్టలు సంపూర్ణము గా వారిచేతనే వృద్ధికి వచ్చినది. వారే ప్రతి ధనికుని వద్ద చందా లెత్తినారు. ప్రతి వివాహములో విరాళములు ప్రోగుచేసినారు. 1333 ఫసలీలో సుమారు 52000, రూసాయిలకు 9000 చదరపు గజముల వైశాల్యముగల యొక పెద్దస్థలమును బంగ్లా యుక్తముగా హాస్టలునకు గాను కొనినారు. అందే యిప్పటికిని రెడ్డి హాస్టలు దినదినాభివృద్ధి నొందుచున్నది. 1334 లో భోజనశాలయు దానిపై ఒక పెద్ద హాలును వంట శాలయు సుమారు 25,000 రూపాయీలు వ్యయము చేసి కట్టించినారు. 1335 లో గ్రంథాలయ భవనమును 4880 రూపాయలకు పైగా వ్యయముచేసి కట్టించినారు. అందిప్పుడు సుమారు 20000 గ్రంథములున్నవి. తర్వాత దాని