పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

123


అను వారిని పిలిపించి వారిచే కొన్ని గ్రామములలో ఆర్థిక విచారణలు గావించి మెదకు తాలూకాలోని బర్డుపల్లియను గ్రామములో గ్రామ పునర్నిర్మాణ కార్యమారంభించిరి. 1335 లోను 1336 లోను సహకార మహాసభలు జరిగినప్పుడు "రెడ్డిగారు ఆహ్వాన సంఘాధ్యక్షులై ఉపన్యాసములు గావించి మహాసభలను జయప్రదముగా నడి పించిరి.


(11) ఉన్మాద వైద్యశాల యుక్క పాలక వర్గములో వీరొక మఖ్యసభ్యులుగా నుండిరి.


(12) కుష్ఠురోగుల ఆశ్రయము యొక్క పాలక వర్గము లోను సభ్యులుగనుండిరి.


(13) నజంజమాయత్ (సైన్య శాఖ) లో విచారణ సంఘములో సభ్యులుగా నుండిరి.


(14) దిక్కు లేని పిల్లల (లావారస్) విచారణ సంఘము యొక్క సభ్యులును నై యుండిరి.


(15) జూడిషియల్, రెవిన్యూ , మునిసిపల్ , మరియు పోలీసు ట్రైయినింగున్కూలు అభ్యర్థులను పరీక్షించు పరీక్షకులుగా నుండిరి.


(16) సీతారాం బాగు దేవాలయము నగరములో చాల గొప్పది. దీనివ్యవస్థ చాల చెడిపోగా వీరందు పాల్గొని దా