పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2


హైదరాబాదులో నేను వారిని మెట్టమొదట సందర్శించి యిరువయిదయిదేండ్లు గావచ్చినది. అప్పుడు వారు పోలీసుశాఖలో చాల ముఖ్యమైన యుద్యోగములో నుండిరి. ఈ యుద్యోగ ధర్మముననుసరించి మ. ఘ. వ. నిజాంప్రభువు సన్ని ధన వర్తులుగా నుండుటకు పెక్కు అవకాశములు వారికి కలుగుచుండెను. ఇట్టి రాజసన్నిధాన వర్తులయందు ఆలోచనా సునిశితత్వము, గ్రహణశీలము, శాంతసమాలోచవము, ముఖ్య ముగా నుండవలసిన అత్యవసర గుణసంజాతము. • రాజూ బహద్దరు వారు ధీర సంపన్నులు, మౌసశీలురు, అయినను; గ్రహణ శీలురు, వినయాచారులు, మిత భాషులు, శాంతియుక్తులు, స్తిమితవిభవులు, అచంచలరు, సానుభూతి సంభావితులు సిద్దాంత రాద్దాంతములయందు మహోదారులు, కావున. హిందువులను, ముసల్మానులును సమానముగా వీరిని ఆదర్శ నీయులగు అధికారిగా నన్నుచుండిరని తెలుపుటకు నేను మిగుల గర్వించుచున్నాను. వీరు పోలీసుళాఖా ప్రధానాధి కార పదవి కెక్కగలిగి, విశ్వాస, పూర్వకముగను, గణనీయ ముగను చేసిన సేవలకు ప్రతిఫలముగా శ్రీమహాఘనత పహించిన ప్రభువువారు రాజాబహద్దరు బిరుదమును ప్రసాదించుటలో ఆశ్చర్యమేమియు లేదు. -

శ్రీయుత వేంకట్రామారెడ్డిగారు విశాల భుజస్కంధులు మాత్రమేగాక, విశాలహృదయులును నైయున్నారు. వీరు